నీటిపారుదల(Irrigation) శాఖ మాజీ ఇంజినీర్-ఇన్-చీఫ్(ENC) మురళీధర్ రావును ACB అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇళ్లు, బంధువుల నివాసాలపై 11 చోట్ల దాడులు చేసి ఆదాయానికి మించి ఆస్తుల్ని గుర్తించారు. మోకిలలో 6,500 చదరపు గజాల భూమి, కొండాపూర్ లో విల్లా, బంజారాహిల్స్, కోకాపేట, బేగంపేట, యూసుఫ్ గూడలో ఫ్లాట్లు.. హైదరాబాద్, కరీంనగర్ లో ఒక్కో కమర్షియల్ బిల్డింగ్.. జహీరాబాద్ లో 2KW సోలార్ పవర్ ప్రాజెక్టు, కోదాడలో అపార్ట్మెంట్ సహా వరంగల్ లో భవన నిర్మాణం జరుగుతున్నట్లు తేల్చారు. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల వ్యవసాయ భూములు, 4 ప్లాట్లు.. ఇళ్ల స్థలాలు, మెర్సిడెజ్ బెంజ్ సహా 3 కార్లు, నగలు, బ్యాంకు నిల్వల్ని గుర్తించారు.