Published 25 Nov 2023
ఐటీ(Income Tax) అధికారులు దూకుడు పెంచారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై కన్నేసిన ఐటీ బృందాలు.. ఎక్కడికక్కడ ఏకకాలంలో దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలపై దాడులు నిర్వహించి భారీస్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివరాల్ని ఇంకా బయటపెట్టాల్సి ఉండగా.. తాజాగా మరో MLA ఇంటిపై IT అధికారులు దాడులకు దిగారు. తాండూరు MLA పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి చేరుకున్న అధికారుల టీమ్ లు.. విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. అధికారుల తనిఖీల్లో MLA ఇంట్లో రూ.20 లక్షల నగదు బయటపడినట్లు సమాచారం. తాండూరులో ఆయన నివాసం నుంచి నగదుతోపాటు వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా ఏమైనా లావాదేవీ(Transactions) జరిగాయా, ఎవరెవరితో నగదు చెల్లింపులు చేశారన్న కోణంలోనూ విస్తృతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అటు MLA అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నుంచి BRS అభ్యర్థిగా విజయం సాధించారు. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్థానంలో సీటు పొంది విజయాన్ని దక్కించుకున్నారు. అప్పట్నుంచి పట్నం మహేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్న రోహిత్ రెడ్డి.. ఈ ఎన్నికల్లోనూ టికెట్ సొంతం చేసుకున్నారు. అయితే హైకమాండ్ సూచనలతో మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి కలిసిపోయారు. మహేందర్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి కేటాయించగా.. రోహిత్ రెడ్డికి అన్ని విధాలా సహకరిస్తానని ఆయన మాట ఇచ్చారు.
Nice