పర్మిషన్ లేకుండా మద్యం(Liquor) పార్టీ చేసుకోవడం, అందులో డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి దొరకడంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. A1గా ఫాం హౌజ్ నిర్వాహకుడు, A2గా రాజ్ పాకాల పేర్లను FIRలో ఫైల్ చేయడంతో కేసు సీరియస్ గా మారింది. రాజ్ పాకాలను అరెస్టు చేసేందుకు రాయదుర్గంలోని ఓరియన్ విల్లాకు చేరుకున్న పోలీసుల్ని.. BRS ఎమ్మెల్యేలు, MLCల అడ్డగించడంతో కొద్దిసేపు గొడవ జరిగింది.
ఆ తర్వాత విల్లాలోకి ఎంటరైన పోలీసులు రాజ్ పాకాల కోసం వెదికారు. ఇలాంటి పరిస్థితుల్లో జన్వాడ ఫాం హౌజ్(Farm House)ను సీజ్ చేయాలన్న ఆలోచనకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ పార్టీలో పలువురు ప్రముఖులున్నట్లు ప్రచారం జరగడంతో ఏకంగా ఎక్సైజ్ జాయింట్ కమిషనరే రంగంలోకి దిగారు.