రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, గవర్నర్ అనుమతి లేకుండా ప్రతిపక్ష నేతపై దర్యాప్తు నిర్వహించడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తాయని చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించనుంది. పిటిషనర్ పై నమోదైన FIR, ACB కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్స్ ను కొట్టివేయాలంటూ 5 గంటల పాటు ఇరు పక్షాల న్యాయవాదులు కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ఈ నెల 22 వరకు రాజమండ్రి జైలులో ఉంటారు. విచారణ సందర్భంగా లాయర్లతో కోర్టు హాలు ఫుల్ అయిపోయింది.
బాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఆన్ లైన్ ద్వారా మరో లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అటు AP CID తరఫున సైతం సీనియర్లే వాదనలు కొనసాగించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఆన్ లైన్ ద్వారా మరో లాయర్ రంజిత్ కుమార్ సహా ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వీటిని విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసి నేడు వెలువరించనుంది.