మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ(Judicial Custody) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 23 వరకు తొమ్మిది రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను మళ్లీ తిహాడ్ జైలుకు తరలిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అదుపులోకి తీసుకున్న CBI.. ఆమెను మూడు రోజుల పాటు విచారించింది.
అప్రూవర్ ను బెదిరించడం, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి(Mastermind) కవితేనని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ లో ED, CBI తెలియజేశాయి. దీనిపై ఇప్పటికే ED విచారణ ముగియగా, తాజాగా CBI అధికారులు సైతం ఆమెను ప్రశ్నించారు. ఈ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.