ఫాక్స్ కాన్ గ్రూప్స్ కు లేఖ రాసిన వార్తలు తప్పుడువని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ వివరణ ఇచ్చారు. యాపిల్ కంపెనీ ప్లాంట్ ను బెంగళూరుకు ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో అసంబద్ధ కథనాలు ప్రసారమవుతున్నాయని, వాటిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తన పేరుతో సోషల్ మీడియాలో తిరుగుతున్న లెటర్ నకిలీదని, దీనిపై సైబర్ క్రైమ్(Cyber Crime) డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు(Complaint) చేశానన్నారు.
జరిగిన కథ ఇది..
అక్టోబరు 25న ఫాక్స్ కాన్ ఛైర్మన్ కు డీకే శివకుమార్ లెటర్ రాసినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. యాపిల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలని, భాగ్యనగరంలో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి రానున్నది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమేనన వాటిలో చాలా వాటిని మా దగ్గరకు తరలించే అవకాశం ఉంటుంది అన్నది అందులోని సారాంశం.
ఫాక్స్ కాన్ సంస్థ వ్యాపారమిదే
యాపిల్ సంస్థ వాడే ఫోన్లు, ఇతర పరికరాలు సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే సంస్థ ఫాక్స్ కాన్. ఈ ప్రముఖ వ్యాపార సంస్థ హైదరాబాద్ లో పెట్టుబడులకు ముందుకొచ్చింది. అమెరికా, చైనా, తైవాన్ తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంగర్ కలాన్ లో 200 ఎకరాల్లో ప్లాంట్ కు రెడీ అవుతున్న టైమ్ లో ఈ లెటర్ బయటకు రావడం సంచలనంగా మారింది.