ఢిల్లీ మద్యం కుంభకోణానికి(Liquor Scam)కు సంబంధించి MLC కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలకు దిగిన ED(Enforcement Directorate) అధికారులు… ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సోదాలు ముగించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏ ఆధారాలతో తనను అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారుల్ని కేసీఆర్ కుమార్తె ప్రశ్నించారు. మరోవైపు బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్దకు భారీగా BRS నాయకులు, కార్యకర్తలు చేరుకుని నినాదాలు చేస్తున్నారు.
భారీ బందోబస్తు నడుమ…
ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం.. స్థానిక అధికారులతో కలిసి మధ్యాహ్నం నుంచి కవిత నివాసంలో సోదాలు నిర్వహించింది. నాలుగైదు గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం కవితను అరెస్టు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఏ ఆధారాలతో తనను అరెస్టు చేస్తారంటూ MLC కవిత.. అధికారుల్ని ప్రశ్నించారు.