బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ ఇవ్వాలంటూ ఆమె పెట్టుకున్న పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆమె తిహార్ జైలులో ఉండనున్నారు. CBI, ED కేసుల్లో తనకు జైలు నుంచి విముక్తి కల్పించాలంటూ ఆమె పిటిషన్ వేశారు.
తారుమారు…
కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని ED తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం విధానం(Liquor Policy)లో ఆమెనే పాత్రధారి, సూత్రధారి అయినందున బెయిల్ ఇవ్వొద్దంటూ కోరారు. ఇరువర్గాల వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ.. కవిత పెట్టుకున్న రెండు పిటిషన్లను తిరస్కరించారు. ఆమె మార్చి 15 నుంచి కారాగారంలో ఉన్నారు.