ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ కింద అరెస్టయి జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత(Kavitha).. తనకు బెయిల్(Bail) మంజూరు చేయాలంటూ మరోసారి కోర్టును కోరారు. ED అధికారులు తనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, తన ఫోన్ నంబరు(Mobile Number)ను కూడా బయటపెట్టి వ్యక్తిగత గోప్యత(Privacy)ని దెబ్బతీశారన్నారు. ED, CBI ఇన్వెస్టిగేషన్ కంటే మీడియా దర్యాప్తే ఎక్కువ జరిగిందని కవిత ఆవేదన చెందారు.
రిమాండ్ పొడిగింపు…
కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాల పాటు ఈనెల 23 వరకు CBI ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారని గుర్తు చేశారు. సాక్షులను బెదిరిస్తున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న కవిత.. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని విమర్శించారు. 95 శాతం కేసులన్నీ విపక్ష లీడర్లపైనే ఉన్నాయని, BJPలో చేరితే కేసులన్నీ మాఫీ అవుతాయని కామెంట్ చేశారు.