ఢిల్లీ లిక్కర్ స్కామ్(Liquor Scam) మనీ లాండరింగ్ కింద అరెస్టై తిహాడ్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను CBI అదుపులోకి తీసుకుంది. జైలు నుంచి ఆమెను విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. కవితను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఇంతకుముందే CBI అధికారులు.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోను CBI స్పెషల్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో ఆమెను CBIకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇంతకుముందే ఆదేశాలిచ్చింది.
వెంట వెంటనే…
కవితను హైదరాబాద్ లో అరెస్టు చేసి ఢిల్లీ తరలించిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న ED అధికారులు.. వారం పాటు ఆమెను విచారించారు. ED కస్టడీ ముగియగానే ఆమెకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో తిహాడ్ జైలుకు తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు CBI కూడా ఆమెను కస్టడీలోకి తీసుకుంది.