కాళ్లు పట్టుకున్నా(Touch Feet) ఆ కామాంధుడు వదలకపోగా, తలుపులు వేసి మరీ అత్యాచారం చేశారు. బెంగాల్లోని సౌత్ కలకత్తా న్యాయ కళాశాలలో విద్యార్థినిపై దారుణం జరిగింది. ఆమె ఏం చెప్పారంటే.. ‘సాయంత్రం 6:10కి అందరూ వెళ్లిపోతున్నారు.. నన్ను కొద్దిసేపు ఆగమని అడిగాడు.. యూనియన్ రూమ్ కు తీసుకెళ్లి నిన్ను చూసిన తొలి రోజునుంచే ఇష్టపడుతున్నాని చెప్పాడు.. అతని గర్ల్ ఫ్రెండ్ మరొకరిని ప్రేమించడంతో తనను పెళ్లి చేసుకోవాలన్నాడు.. నేను బ్యాగ్ తీసుకుని వెళ్దామనేలోపే బయటి నుంచి డోర్ కు లాక్ చేయాలని మరో ఇద్దరికి చెప్పాడు.. ఆ తర్వాత నన్ను బాత్రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు..’ అంటూ పోలీసులకు తెలిపింది.