ఇంటి యజమానిని మరొకరితో కలిసి హత్య చేసిన వంటమనిషి.. బంగారం, నగదుతో పరారయ్యాడు. కాళ్లు, చేతులు కట్టేసి.. కత్తులతో పొడిచి, ప్రెషర్ కుక్కర్ తో కొట్టి అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశారు. హైదరాబాద్ కూకట్ పల్లి మహిళను వంటమనిషే హత్య చేసినట్లు గుర్తించారు. హత్య తర్వాత అక్కడే స్నానం చేశాక బైకుపై పరారయ్యారు. స్టీల్ ట్రేడింగ్ బిజినెస్ చేసే ఆమె భర్తతోపాటు తనయుడు సైతం ఆఫీసుకు వెళ్లారు. రాత్రి 7:30కు ఇంటికి వస్తే తాళం ఉంది. ప్లంబర్ సాయంతో బాల్కనీ నుంచి లోపలికి వెళ్లి చూస్తే ఆమె విగతజీవిగా పడి ఉంది.