
నామినేషన్ల(Nominations) సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లకు పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అక్రమార్కులు. ఇప్పటికే డబ్బు, బంగారం, వెండిని భారీయెత్తున స్వాధీనం చేసుకుంటుండగా.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక మద్యం(Liquor), మాదక ద్రవ్యాలు(Drugs), గంజాయి(Ganja) ఊహించని స్థాయిలో పట్టుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న అక్రమ సరకు విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మూకుమ్మడిగా దాడులు నిర్వహించగా అక్రమం(Illegal)గా నిల్వ ఉంచిన సరకు బయటపడింది. ఐదు జిల్లాల పరిధిలో మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు స్వాధీనపరచుకున్నామని అబ్కారీ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ తెలిపారు.
ఆ జిల్లాలివే
నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్ జిల్లాల పరిధిలో అబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. కోటీ 43 లక్షల రూపాయల విలువైన 15,580 లీటర్ల లిక్కర్ ను పట్టుకున్నారు. 2.5 లక్షల లీటర్ల లిక్కర్, 560 కేజీల గంజాయి, కోటిన్నర విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు.