
ఢిల్లీ బాంబు దాడి(Bomb Blast) కేసులో ఎన్నో అనుమానాలున్నాయి. దాడికి కొన్ని గంటల ముందే అల్-ఫలాహ్ వర్సిటీ ప్రొఫెసర్ డా.ముజమ్మిల్ ఇంట్లో 2,913 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. వర్సిటీ ల్యాబ్ లో RDXపై ప్రయోగాలు జరిగాయా.. వర్సిటీ హాస్పిటల్ ను, అందులోని విద్యార్థుల్ని వాడుకున్నాడా.. ముజమ్మిల్, మరో మహిళా డాక్టర్ సహా ఏడుగురు అప్పటికే అరెస్టయితే తాను కూడా దొరికిపోతానన్న భయంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా.. అన్న సందేహాలున్నాయి.
అటు మృతుల సంఖ్య 12కు చేరింది. ఇంకో 17 మంది LNJP ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధ్యులైన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. లగేజీతోపాటు విమానాల్ని తనిఖీ చేయాలని, ఎమర్జెన్సీ ల్యాండింగయ్యే విమానాలపై దృష్టిపెట్టాలని ఆదేశాలు వెళ్లాయి.