హైదరాబాద్ లో రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ కోసం మహారాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. మీరా-భయందర్, వసాయ్-విరార్ పోలీసులు కొన్నాళ్లుగా ఓ ముఠాపై నిఘా ఉంచారు. ఫాతిమా(23) అనే బంగ్లా యువతి రూ.24 లక్షల డ్రగ్స్ తో దొరకడంతో.. రహస్య ఆపరేషన్ చేపట్టారు. 60 చోట్ల దాడులు చేసి వాగ్దేవి ల్యాబ్స్ అనే నకిలీ లైసెన్సుతో చర్లపల్లిలో ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు గుర్తించారు. దానిపై దాడికి దిగి శ్రీనివాస్, తానాజీ పాఠేను పట్టుకున్నారు. 100 గ్రాముల మెఫడ్రిన్, 25 లక్షల నగదు, 32 వేల లీటర్ల రసాయనాల్ని సీజ్ చేశారు. ఇంతపెద్ద నెట్వర్ హైదరాబాద్ లో ఉండటం, దేశవ్యాప్తంగా సరఫరా కావడం సంచలనంగా మారింది. దీని వెనుక ఎవరున్నారనే పనిలో పోలీసులున్నారు.