
పాకిస్థాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టయ్యాడు. పశ్చిమబెంగాల్ పుర్బా వర్ధమాన్ జిల్లాకు చెందిన షరీఫ్ షేక్.. ముంబయిలో వస్త్రాల బిజినెస్ చేస్తున్నాడు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియా(Social Media) ప్లాట్ ఫాంలో పోస్ట్ చేశాడు. కానీ తప్పుదిద్దుకున్న అతడు దాన్ని తొలగించాడు. అయితే ఇంతలోనే షరీఫ్ పై కేసు నమోదైంది. బెంగాల్ పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకుని సొంత జిల్లాకు తరలించారు. రెచ్చగొట్టడం, రాజద్రోహం కింద కేసులు నమోదు చేశారు. కేరళలో మేస్త్రీ పనిచేసిన అతడు తర్వాత ముంబయి వెళ్లి బిజినెస్ చేసుకుంటున్నాడు.