
మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివిధ దశల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సందీప్ దీపక్ రావును అరెస్టు చేసినట్లు DGP అంజినీకుమార్ ప్రకటించారు. మహారాష్ట్ర, కేరళ, తమినాడు, కర్ణాటక పోలీసుల వాంటెడ్ లిస్టులో ఈయన ఉన్నారన్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజ్, గణపతి, కోశా, గణేశ్, సోనూ వంటి టాప్ లీడర్లు, పొలిట్ బ్యూరో మెంబర్లు పాల్గొన్న మీటింగ్ కు సందీప్ దీపక్ రావు అటెండ్ అయ్యారని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలతో సమావేశాలు నిర్వహించారని DGP తెలియజేశారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ‘ట్రై జంక్షన్’ ఏరియాలో దీపక్ రావు కీలకంగా వ్యవహరిస్తున్నారని, పశ్చిమ కనుమల ప్రత్యేక జోన్ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నారని తెలిపారు.
దీపక్ రావు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయని, పక్కా ఇన్ఫర్మేషన్ తోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు DGP తెలిపారు. దక్షిణ భారత దేశానికి చెందిన అన్ని రాష్ట్రాల పోలీసులు ఈయన కోసం వెతుకున్నట్లు వివరించారు.