కంటోన్మెంట్ శాసనసభ్యురాలు(MLA) లాస్య నందిత కేసులో కీలక విషయం వెలుగుచూసింది. ఆమె కారు టిప్పర్ ను ఢీకొట్టిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్(ORR) రెయిలింగ్ వైపు దూసుకుపోయిందని పోలీసులు గుర్తించారు. రెయిలింగ్ ను కారు ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా, లేక ఏదైనా ఇతర వెహికిల్ ఆ కారును బలంగా తాకిందా అన్న కోణంలో ముందునుంచీ అనుమానాలున్నాయి. అయితే లాస్య నందిత మృతి తర్వాత ఎనిమిది రోజులకు ఈ కేసులో పురోగతి(Development) కనిపించింది.
దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు(Investigation) చేశారు. ఆమెతోపాటు కారు ప్రమాదంలో గాయపడ్డ పీఏ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కూపీ లాగారు. ఔటర్ రింగ్ రోడ్డుపై సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత టిప్పర్ ను ఢీకొట్టడం వల్లే ఘటన జరిగినట్లు నిర్ధారించుకున్నారు. టిప్పర్ తోపాటు లారీ డ్రైవర్ ను కర్ణాటకలో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లాస్య నందిత కారు హై స్పీడ్ తో వచ్చి తన టిప్పర్ నే ఢీకొట్టినట్లు సదరు డ్రైవర్ అన్నట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్యే కారును ఆమె PAనే నడుపుతుండగా.. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. పటాన్ చెరు ORRపై వెళ్తున్న టిప్పర్ ను లాస్యనందిత కారు బలంగా ఢీకొట్టింది. అలా ఆ కారు అదే స్పీడ్ తో వెళ్లి రెయిలింగ్ ను తాకింది. ఈ ఘటనలో MLA అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె PA మాత్రం గాయాలతో బయటపడ్డారు.
గత నెల 23న ఈ ఘటన జరిగితే ఈ ఇన్సిడెంట్ పై లాస్య నందిత సోదరి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. యాక్సిడెంట్ పై అనుమానాలున్నాయని, దర్యాప్తు నిర్వహిస్తే అసలు విషయాలు తెలుస్తాయని ఫిర్యాదులో తెలియజేశారు. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పరిశీలిస్తే టిప్పర్ విషయం బయటపడింది. ఈ టిప్పర్ ను ట్రేస్ ఔట్ చేసి కర్ణాటకలో దాన్ని పట్టుకున్నారు.