ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్(Money Laundering) కేసులో అరెస్టయిన కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) రేపటితో కంప్లీట్ అవుతుంది. కవిత మధ్యంతర బెయిల్(Interim Bail)పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కావేరి భవేజా.. జడ్జిమెంట్ ను ప్రకటించారు.
ఈనెల 4నే…
ఈనెల 4న తీర్పును రిజర్వ్ చేసి ఆమెను విచారించేందుకు CBIకి అనుమతిచ్చారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు(Exams) ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అయితే ఆమె తనయుడు చిన్నవాడేం కాదని, ఇప్పటికే అప్రూవర్ ను బెదిరించినందున బెయిల్ ఇవ్వొద్దంటూ ED న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మార్చి 26 నుంచి…
ఆమెకు బెయిల్ ఇస్తే కేసు ఇన్వెస్టిగేషన్ పై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి ED(Enforcement Directorate) తెచ్చింది. కవితను అరెస్టు చేసి ED కస్టడీ ముగిసిన తర్వాత కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ తో.. మార్చి 26 నుంచి ఆమె తిహాడ్ జైలులో ఉన్నారు. ED అభిప్రాయంతో ఏకీభవించిన కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ ను నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.