కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్(Money Laundering) కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA)కి సంబంధించి ఆయనపై కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఫైల్ చేసింది. CM తన సతీమణి బి.ఎం.పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 స్థలాలు కేటాయించడంతో సర్కారుకు రూ.45 కోట్ల నష్టమని, విచారణ జరిపించాలంటూ ముగ్గురు వ్యక్తులు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కోరారు. గవర్నర్ ఆమోదించడం, స్పెషల్ కోర్ట్, హైకోర్టు సమర్థించడంతో ఈనెల 27న లోకాయుక్తలో కేసు ఫైల్ అయింది.
ED కేసు నమోదైన విపక్షాల మూడో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అంతకుముందు జార్ఖండ్ CM హేమంత్ సోరెన్, ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవుల్ని కోల్పోగా కేజ్రీవాల్ కు ఆరు నెలల తర్వాత, సోరెన్ 5 నెలలు పూర్తయ్యాక బెయిల్ దొరికింది. ఇప్పుడు సిద్ధరామయ్య విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.