మెదక్ MP, కమలం పార్టీ సీనియర్ నేత రఘునందన్ రావు సంచలన విషయాల్ని వెల్లడించారు. మాజీ CM కేసీఆర్ పై ఈడీ(Enforcement Directorate) కేసు ఫైల్ చేసిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కోసం ఇప్పుడే ED అధికారులు వచ్చారని తెలియజేశారు. లోక్ సభ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించిన ఆయన.. KCRతోపాటు మెదక్ నుంచి పోటీ చేసిన తన ప్రత్యర్థి వెంకట్రామిరెడ్డికి అసలు కథ ముందుందని అన్నారు.