దేశంలో కొత్త చట్టాలు(New Acts) ఈనెల 1 నుంచి అమలులోకి వచ్చాక రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాప్రతినిధిపై అందులోని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. భారతీయ న్యాయ సంహిత(BNS) అమల్లోకి వచ్చిన మూడోరోజే హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్తు సమావేశంలో కలెక్టర్ ను అడ్డుకున్నారంటూ ZP అధికారులు కంప్లయింట్ ఇచ్చారు.
విధులకు ఆటంకం కలిగించారంటూ BNS యాక్టులోని 221, 126(2) సెక్షన్ల కింద కేసు పెట్టారు. జడ్పీ పాలకవర్గ చివరి సమావేశం మంగళవారం గరం గరంగా సాగింది. వైద్యారోగ్య శాఖపై MLA ప్రశ్నిస్తే పలువురు ZPTCలు వివరణ ఇచ్చారు. BRS తరఫున ఎక్కువ మంది సభ్యులుండటం, కాంగ్రెస్ నుంచి మొత్తం ఆరుగురు మాత్రమే గెలవడంతో.. కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇరువర్గాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి.