బెట్టింగ్ యాప్స్(Betting Apps) ఉచ్చులో పడి అమాయకులు సమిధలవుతున్న కేసులో.. సెలబ్రిటీలకు నోటీసులు జారీ అయ్యాయి. యూట్యుబర్లు, ఇన్ స్టా యూజర్లు 11 మందిపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. YSRCP అధికార ప్రతినిధి శ్యామల, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, విష్ణుప్రియ, రీతూచౌదరి, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్, టేస్టీ తేజ పేర్లున్నాయి. విచారణకు రావాలంటూ విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు పంపించారు. విద్యార్థుల్లో చాలామంది బెట్టింగ్ యాప్ లకు బానిసలవుతున్నారంటూ మియాపూర్ వాసి కేసు వేశారు. శిక్షణ కేంద్రాలకు వచ్చే విద్యార్థులు.. సెలబ్రిటీల ప్రకటనలతో యాప్ ల వలలో చిక్కుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.