PHOTO: THE TIMES OF INDIA
చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ACB న్యాయస్థానంలో ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. ఆయన్ను ఓపెన్ కోర్టులోనే విచారణ చేయాలని బాబు తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆదివారం సెలవు అయినందున ఓపెన్ కోర్టు సాధ్యం కాకపోవచ్చన్న మాటలు వినపడ్డాయి. ఓపెన్ కోర్టుకు పర్మిషన్ ఇస్తే వాదనల్ని అందరూ వినే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం భారీగా భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఓపెన్ కోర్టు కాకుండా ఇన్నర్ కోర్టులో వాదనలకు అనుమతిస్తే ఇరు పక్షాల లాయర్లను మాత్రమే అనుమతిస్తారు.