రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసి అయోమయం సృష్టించిన పేపర్ లీకేజ్(Leakage) కేసును ఇప్పటికే హైకోర్టు విచారణకు స్వీకరించగా.. సిట్ సైతం అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ లీడర్ బక్కా జడ్సన్ వేసిన పిల్ ను హైకోర్టు స్వీకరించిన ఈరోజే(ఆగస్టు 16)నాడే మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సిట్ ప్రకటించింది. ప్రధాన నిందితుడు(Main Accused) అయిన ప్రవీణ్ కు చెందిన బంధువులు ముగ్గురిని సిట్(Special Investigation Team) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముగ్గురు ప్రవీణ్ కు సహాయ సహకారాలు అందించారని గుర్తించి అరెస్టు చేసింది. దీంతో ఈ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మొత్తం అరెస్టుల సంఖ్య 99కి చేరుకుంది.