పోలింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడ్డళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. పోలింగ్ బూత్ వద్ద జరిగిన చిన్న గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం కోరుట్లలో BRS, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మధ్య ఘర్షణ తలెత్తింది. పొద్దున పోలింగ్ బూత్ కు వెళ్లిన నర్సింహారెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు కోరుట్ల సర్పంచితో వాగ్వాదానికి దిగాడు. పోలింగ్ ముగిసిన తర్వాత నర్సింహారెడ్డి తమ్ముడు తిలక్ రెడ్డి వర్గీయులు సదరు గ్రామానికి చేరుకున్నారు. వీరిని చూసి కోపోద్రిక్తులైన కోరుట్ల వాసులు గొడ్డళ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో మొత్తం ఆరుగురికి గాయాలు కాగా.. బాధితుల్ని దేవరకొండ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆ గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కేసు నమోదు చేశారు.