అన్నదమ్ముల బంధాన్ని ఆస్తి ఆవిరి చేసింది…
తాత ఇచ్చిన ఆస్తి తోబుట్టువుల్ని రాక్షసుల్ని చేసింది..
అనుబంధాల్ని ఆవిరిచేస్తూ ఆస్తిపాస్తుల్నే ఆలంబనగా చేసుకుంటూ సాగించిన దుర్మార్గం నిండుపాణాన్ని బలి తీసుకుంది.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో ఈ విషాద(Tragedy) ఘటన జరిగింది. ఎకరంన్నర పొలం కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. ఆయువును ఆర్పేసింది. లక్ష్మప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య బాలమ్మకు సంజప్ప.. చిన్న భార్య తిప్పమ్మకు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్ప అనే తనయులున్నారు. 9 ఎకరాల భూమిని లక్ష్మప్ప ముగ్గురికి మూడెకరాల చొప్పున సమానంగా పంచి ఇచ్చాడు. ఇద్దరు భార్యలకు నాలుగున్నర ఎకరాల చొప్పున పంచాలంటూ గొడవ స్టార్ట్ అయింది.
తమకు ఎకరంన్నర భూమి ఇవ్వాలంటూ సంజప్ప కుమారులు తమ చిన్నమ్మ తనయులైన ఇద్దరు సౌరప్పలతో గొడవ పడుతున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న సంజప్ప ఊరికి చేరుకుని పొలం దున్నుతున్న సమయంలో ఆయన పెదనాన్న కుటుంబం అడ్డుకుంది. అన్నదమ్ములతోపాటు 10 మంది దాకా చితకబాదడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత నారాయణపేటకు ఆ తర్వాత మహబూబ్ననగర్ ఆసుపత్రికి తరలించినా ఆయన ప్రాణాలు నిలవలేదు. ఈ అమానుష దాడి ఘటన దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఎస్సై సస్పెండ్…
విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఉట్కూరు SI బిజ్జ శ్రీనివాసులును మల్టీజోన్-II ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చినా స్పందించకుండా నిర్లక్ష్యం, దురుసుగా ప్రవర్తించినట్లు ఐజీ దృష్టికి వచ్చింది.