ఢిల్లీ లిక్కర్ కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టులో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెనక్కు తీసుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ గతంలో పలు సార్లు కవితకు నోటీసుల్ని ED పంపింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల్ని ఆఫీసుల్లో కాకుండా ఇంటివద్దే విచారించాలని ఆదేశించాలంటూ ఆమె పిటిషన్(Petition) దాఖలు చేశారు.
ఇప్పటికే అరెస్టు…
ఇటు సుప్రీంకోర్టు విచారణ సాగుతుండగానే కవిత ఇంట్లో సోదాలు చేసి మరీ ఆమెను అరెస్టు చేసింది ED. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం(Top Court)లోనే తేల్చుకుంటామని మాజీ మంత్రి KTRతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. దీంతో ఈ రోజు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం(Devision Bench) ముందుకు కేసు విచారణ రావాల్సి ఉంది.
ఉపసంహరణకే మొగ్గు…
అయితే అనూహ్యంగా ఈ కేసును విత్ డ్రా చేసుకుంటున్నామని కవిత తరఫు న్యాయవాది(Lawyer) విక్రమ్ చౌదరి.. న్యాయమూర్తులను అభ్యర్థించారు. దీంతో బెంచ్ వీరి అభ్యర్థనను మన్నించడంతో పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు.