దొంగతనాలే కాదు పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై సైతం దాడికి పాల్పడ్డారు చోరులు(Thiefs). దీంతో చేసేదిలేక ఖాకీలు(Police) కాల్పులకు పాల్పడ్డ ఘటన ఔటర్ రింగ్ రోడ్(ORR) సమీపంలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై కొంతకాలంగా మోటార్ సైకిళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో పూర్తి నిఘా పెట్టిన నల్గొండ CCS(సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు.. చోరీలకు పాల్పడే ముఠాను గుర్తించారు.
జాయింట్ గా…
దుండగుల్ని పెద్ద అంబర్పేట వద్ద ORR సమీపంలో పట్టుకునేందుకు యత్నిస్తున్న సమయంలో పోలీసులపైనే కత్తులతో దాడి(Attack)కి పాల్పడబోయారు. దీన్ని గుర్తించిన నల్గొండ పోలీసులు తొలుత రాచకొండ కమిషనరేట్ అధికారులను మెసేజ్ ఇచ్చారు. దీంతో నల్గొండ, రాచకొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా కాల్పులకు దిగాల్సి వచ్చింది. చివరకు నలుగురు సభ్యుల ముఠాను పట్టుకుని ఠాణాకు తరలించారు.