తాత వయసులో ఉన్న ఆ దుర్మార్గ ప్రిన్సిపల్.. ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండగా ప్రతిఘటించిన బాలికను హత్య చేశాడు. ఈ ఘటన గుజరాత్(Gujarat)లోని దాహోద్(Dahod) జిల్లాలో జరిగింది. మృతదేహాన్ని స్కూల్ కాంపౌండ్ లో.. బ్యాగ్, బూట్లను క్లాస్ రూం సమీపంలో పడేశాడు. సాయంత్రం మృతదేహం లభ్యం కావడంతో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలైంది.
55 ఏళ్ల గోవింద్ నట్ అనే ప్రిన్సిపల్ నిత్యం(Daily) ఆ చిన్నారిని తన కారులో స్కూలుకు తీసుకెళ్లేవాడు. రోజూ మాదిరిగానే ఆమె తల్లి ప్రిన్సిపల్ కారులో పాపను ఎక్కించినా స్కూలుకు మాత్రం చేరుకోలేదు. దారిలో లైంగికంగా వేధించడంతో బాలిక అడ్డుకోగా… అరవకుండా ఆపేందుకు ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి లాక్ చేశాడు. సాయంత్రం ఆ డెడ్ బాడీని స్కూలు వెనకాల విసిరేసి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు.
10 టీంలుగా ఏర్పడ్డ పోలీసులు గోవింద్ నట్ ఫోన్ లొకేషన్ వివరాల్ని పరిశీలించారు. అతడు ఆ రోజు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నట్లు తేలగా, తమదైన శైలిలో విచారిస్తే నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్ పై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు.