గురువుల్ని పూజించాల్సిన గురు పౌర్ణమి రోజే దారుణం జరిగింది. ఇద్దరు పన్నెండో తరగతి(Inter Second Year) విద్యార్థులు ప్రిన్సిపల్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. హరియాణా హిసార్(Hisar)లోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ లో ఘటన జరిగింది. జుట్టు కత్తిరించుకుని, మంచి డ్రెస్ వేసుకుని రావాలంటూ ప్రిన్సిపల్ జగ్బీర్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థులు.. వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నారు. ప్రిన్సిపల్ కడుపులో పదేపదే పొడవడంతో ఆయన అక్కడికక్కడే కూలిపోయారు. కత్తిని అక్కడే పడేసి పారిపోతున్న దృశ్యాలు CCTVల్లో రికార్డయ్యాయి.