భాగ్యనగరంలో మరో దారుణం వెలుగుచూసింది. 38 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి అనంతరం బండరాయితో కొట్టి చంపారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ.. నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఓ నిర్మాణ సంస్థకు వెళ్లింది. తుక్కు ఏరుకోవడానికి శుక్రవారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆమెను… దుండగులు దారుణంగా పొట్టనబెట్టుకున్నారు. అత్యాచారం చేసిన అనంతరం బండరాయితో కొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అంటున్నారు.
ఆమె కనిపించకుండా పోయినట్లు శుక్రవారం నాడే గచ్చిబౌలి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు కాగా.. ఇద్దకు కుమారులు, కుమార్తె ఉన్నారు.