ఢిల్లీ ఎర్రకోట(Red Forte)లో రూ.1.5 కోట్ల విలువైన బంగారు వస్తువుల చోరీ కేసులో దొంగ దొరికాడు. జైనుల ‘దశ్ లక్షణ్ మహాపూర్వ్(10 రోజుల పండుగ)’ను ఈనెల(సెప్టెంబరు 3న) నిర్వహించారు. పూజారి వేషంలో వచ్చిన భూషణ్ వర్మ.. బంగారు జరీ గల 760 గ్రాముల కలశంతోపాటు వజ్రాలు, ఎమరాల్డ్స్, రూబీలతో కూడిన 115 గ్రాముల మరో కలశాన్ని ఎత్తుకుపోయాడు. ఇవన్నీ CC కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి వ్యాపారి సుధీర్ జైన్ వి కాగా… పూజల వేళ అక్కడకు తెస్తుంటారు. సదరు దొంగను ఉత్తరప్రదేశ్ హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.