ఏపీ మాజీ CM చంద్రబాబుకు విధించిన రిమాండ్ ను ACB కోర్టు పొడిగించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో వర్చువల్(Online)గా ఆయన్ను జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. రాజకీయ కక్షలో భాగంగా తనను ఇరికించారని ఆయన చెప్పుకున్నారు. మరో రెండు రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 24 వరకు జైలులోనే ఉంటారు. వాస్తవానికి రిమాండ్ పూర్తయిన తర్వాత ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ చంద్రబాబును కోర్టుకు తరలించడం భద్రత కూడుకున్న సమస్య కాబట్టి వర్చువల్ గా ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ పరిస్థితులపై ఆయన జడ్జికి చెప్పుకున్నారు.
ఈ వయసులో పెద్ద పనిష్మెంట్(Punishment)
కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాల్ని జడ్జి కోరడంతో.. ఆయన తన బాధనంతా వెళ్లగక్కారు. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారన్న ఆయన.. 45 ఏళ్ల సుదీర్ఘ జీవితం నాది అని వివరించారు. తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాలి.. కానీ అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు అంటూ ACB కోర్టుకు చెప్పుకున్నారు.