పొద్దు పొద్దున్నే పనులకు వెళ్దామని బయల్దేరితే లారీ రూపంలో మృత్యువు ఎదురైంది. తాము ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలను ఎటూగాకుండా చేసి ఆ మహిళలంతా పరలోకానికి పయనమయ్యారు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద జరిగింది. గుంటూరు-కర్నూలు నేషనల్ హైవేపై ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలిలోనే ముగ్గురు మృతి చెందగా.. హాస్పిటల్ లో చికిత్స పొందతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నలుగురు మహిళలు ఉండటం విషాదకరంగా మార్చింది. ఈ దుర్ఘటనలో ఇంకో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో నరసరావుపేట ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది.