Published 29 Jan 2024
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం(Incident)లో మహిళ సహా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జనుజ్జయిన ఘటన భయానకంగా కనిపించింది. నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై మిర్యాలగూడలోని కృష్ణానగర్ వద్ద ప్రమాదం జరిగింది. కారును లారీ చాలా వేగం(Speed)గా ఢీకొట్టడంతో మహిళ సహా ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ నుంచి తిరిగివస్తూ…
మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు(Investigation) నిర్వహిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మహేశ్(35), జ్యోతి(30), మచ్చేందర్(38), ఇషిక(8), లియాన్స్(2) ఉన్నారు. విజయవాడ వెళ్లి తిరిగివస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది.