
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో ఇవాళ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రమాదాల బారిన పడ్డారు. అటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ లో బైక్ ను ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి.
కరీంనగర్ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బైక్ ను వెహికిల్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. మృతులది చిగురుమామిడి మండలం రామంచగా గుర్తించారు. ఇసుక ట్రాన్స్ పోర్ట్ చేసే వాహనాలేమైనా ఢీకొట్టాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద కారును లారీ ఢీకొట్టి రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. బాసర దైవ దర్శనం పూర్తి చేసుకుని తిరిగివెళ్తున్న సమయంలో దుర్ఘటన జరిగింది. మరో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఖమ్మం హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఆ కారులో మొత్తం 10 మంది ట్రావెల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం అర్థరాత్రి కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సు కూకట్ పల్లి వద్ద అదుపుతప్పిన సమయంలో… అక్కడే యూ టర్న్ తీసుకుంటున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద కారు… మార్నింగ్ వాక్ కు వెళ్లిన ముగ్గుర్ని ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. ఇద్దరు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులు తల్లి, కూతురుగా గుర్తించారు.