అప్సర హత్య కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. శంషాబాద్ లో సంచలనంగా మారిన హత్యకేసులో నిందితుడు సాయికృష్ణను శుక్రవారం.. నార్కుడ వద్ద హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. గురువారం నిందితుణ్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. ఘటన తీరుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత అక్కణ్నుంచి అప్సరను మ్యాన్ హోల్ లో పడేసిన ప్రాంతానికి శుక్రవారం రాత్రి తీసుకెళ్లారు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన అప్సర అనే మహిళను కిరాతకంగా హత్యచేసిన కేసులో ఆమె ప్రియుడైన ఆలయ పూజారి సాయికృష్ణను అరెస్టు చేశారు. మ్యాన్ హోల్లో నిందితుడు మట్టి పోయించగా, మట్టి పోసిన టిప్పర్ యజమానితోపాటు కూలీని సీన్ రీకన్ స్ట్రక్షన్ లో విచారించారు. యజమాని, కూలీ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అటు సాయికృష్ణ ఇంట్లోనూ పోలీసుల ఎంక్వయిరీ నడిచింది.