
రూమ్ మేట్‌గా చేరిన సెక్స్ వర్కర్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగికి పనిచేస్తున్న సి.కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉండేవాడు.
ఈ క్రమంలో రూమ్మేట్ కోసం సోషల్ మీడియా యాప్‌లో ప్రకటన ఇచ్చాడు. ఓ మహిళ ఆసక్తి చూపి గదిలో చేరింది.
ఏడాది తర్వాత మకాంను కూకట్‌పల్లికి మార్చారు. అప్పుడే సదరు మహిళ అసలు రూపం బయట పెట్టింది.
తానో సెక్స్ వర్కర్ అని చెప్పడంతో షాక్‌కు గురైన కిరణ్‌కుమార్ వెంటనే రూం ఖాళీ చేయాలని కోరాడు.
అందుకు నిరాకరించిన ఆ మహిళ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది.
తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదరించడమే కాకుండా కిరణ్‌పై లైంగిక దాడి కేసు పెట్టింది.
ఆ మహిళకు రూ.4.70లక్షలు ఇచ్చిన విషయాన్ని కిరణ్ సెటిల్ చేసుకున్నాడు.
కానీ, సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్ కుమార్ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో వాటిని తొలగించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.