రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. గొర్రెల పంపిణీ(Sheep Distribution) పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ(ACB) గుర్తించింది. దీంతో ఈ కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తుల్ని ACB అధికారులు అరెస్టు చేశారు. పశుగణాభివృద్ధి CEO.. గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు MDగా పనిచేసిన రాంచందర్ నాయక్ తోపాటు పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని మాజీ OSD కల్యాణ్ కుమార్ ను ACB అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ ఇద్దరినీ విచారిస్తే అసలు విషయాలు బయటకు రాగా.. భారీ మొత్తంగా కుంభకోణం జరిగినట్లు ACB అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ స్కీమ్ పై ఇప్పటికే ACB ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. 2015లో గొర్రెల పంపిణీ పథకాన్ని KCR సర్కారు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు.