తాగిన మత్తులో తల్లిదండ్రులిద్దరినీ కన్న కొడుకే హత్య చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్ పరిధిలో శరత్ అనే 26 యువకుడు.. తండ్రి భాస్కర్(63), తల్లి శాంత(60)ను ఇనుప కడ్డీతో కొట్టి చంపాడు. మంగళూరుకు చెందిన ఈ కుటుంబం 12 ఏళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటోంది. భాస్కర్ హోటల్లో పనిచేస్తుండగా, తల్లి శాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఈ మధ్యకాలంలోనే రిటైర్ అయ్యారు. వారికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద తనయుడు వేరే చోట ఉండగా.. చిన్నోడు శరత్ మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. మానసిక వ్యాధితో బాధపడుతున్న నిందితుడు.. గతంలోనూ కన్నవారిని కొడుతుండేవాడని బెంగళూరు DCP తెలిపారు.
సోమవారం రాత్రి లిక్కర్ తాగి వచ్చి ఇంట్లో గొడవపడి తల్లిదండ్రులపై దాడి చేశారని వివరించారు. మంగళవారం పొద్దున చూసేసరికి ఇద్దరూ మృతి చెంది ఉన్నారని DCP తెలిపారు.