కల్వకుంట్ల కవితను కోర్టులో హాజరుపెట్టిన సమయంలో విచిత్ర సంఘటన ఎదురైంది. ఆమెను న్యాయస్థానానికి తీసుకెళ్తునప్పుడు ఎదురుపడ్డ మీడియాతో ఆమె మాట్లాడుతున్నారు. ఇలా మొన్న ED, ఈరోజు CBIతోపాటు భారతీయ జనతాపార్టీపై విమర్శలు చేశారు. BJP నేతలు బయట మాట్లాడుతున్న విధంగానే లోపల ED, CBI ప్రశ్నలు అడుగుతున్నాయని, ఇది కమలం పార్టీ కస్టడీ అని మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.
బెయిల్ పిటిషన్ పై…
బెయిల్ మంజూరు చేయాలన్న MLC రిక్వెస్ట్ పై ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టు CBIకి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న బెయిల్ పిటిషన్(Bail Petition)పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూనే ఆమె మీడియాతో మాట్లాడటంపై వార్నింగ్ ఇచ్చింది. కవిత కేవలం అధికారుల విచారణలోనే మాట్లాడాలని, ఇకపై మీడియాతో మాట్లాడకూడదని ఆమె తరఫు న్యాయవాదికి స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది.