
కూకట్ పల్లి శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగపట్ల మానస అనే స్టూడెంట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉన్నట్టుండి కాలేజీలో స్పృహ కోల్పోవడంతో మానసను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమె కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారని అక్కడివారు చెబుతున్నట్లు పోలీసులు తెలియజేశారు.