చండీగఢ్ మేయర్ ఎన్నికలపై తీవ్రంగా ఆగ్రహం చెందిన సుప్రీంకోర్టు.. మేయర్ ఎన్నిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఎన్నిక చెల్లదని తీర్పునిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కౌన్సిలర్ అయిన కుల్దీప్ కుమార్ ను మేయర్ గా ప్రకటించింది(Declared). ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి(RO) చట్ట విరుద్ధంగా ప్రవర్తించారన్న న్యాయస్థానం… అతణ్ని విచారించాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి అపహాస్యం చేశారని CJI జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్నికల అధికారి రద్దు చేసిన ఓట్లను పరిశీలించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం(Bench).. అవన్నీ ఆప్ కు వ్యతిరేకంగా ఉన్నాయని నిర్ధరించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందంటూ RO అనిల్ మసీహ్ పై విచారణ(Prosecuted)కు ఆదేశించింది. ఈ కేసును సీరియస్ గా పరిశీలించిన ధర్మాసనం… 8 ఓట్లపై X(ఇంటూ) మార్క్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కు వ్యతిరేకంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా RO ప్రకటించారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసి రచ్చరచ్చగా మారింది.
డిసెంబరు 30న జరిగిన ఎన్నికల్లో BJP అభ్యర్థి గెలిచినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కానీ ట్యాంపరింగ్ వల్లే తమ అభ్యర్థిని గెలవకుండా చేశారని ఆప్-కాంగ్రెస్ ఆరోపించాయి. ఫిబ్రవరి 5న కుల్దీప్ సుప్రీంకోర్టు వెళ్లగా.. బ్యాలెట్ పేపర్లను చెల్లకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని RO హత్య చేశారని జడ్జీలు మండిపడ్డారు. ఎలక్షన్ కు సంబంధించిన వీడియోలన్నీ సమర్పించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 19న జరిగే విచారణకు అటెండ్ కావాలంటూ ROకు ఆదేశాలిచ్చింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పునిచ్చిన అపెక్స్ నిర్ణయాన్ని తాజా తీర్పుతో పక్కనపెడుతూ.. ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ హత్య గాకుండా చూస్తామంటూ మేయర్ అభ్యర్థిగా కుల్దీప్ కుమార్ ను సుప్రీంకోర్టు ప్రకటించింది.