2008 ముంబయి దాడుల సూత్రధారి తహవుర్ హుస్సేన్ రాణా నిజాల్ని ఒప్పుకున్నాడు. పాక్ ఏజెంట్ నని అంగీకరించాడు. అమెరికా(America) అప్పగించిన రాణా ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నాడు. ‘మిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి లష్కరే తొయిబా ట్రెయినింగ్ లో పాల్గొన్నా.. క్వెట్టాలోని పాక్ ఆర్మీ మెడికల్ కాలేజీలో 1986లో MBBS చేశా.. సింధ్, బలూచిస్థాన్, సియాచిన్, బహావల్పూర్లో పనిచేశా.. ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయి డ్యూటీ మానేయడంతో పారిపోయిన వ్యక్తిగా ప్రకటించారు.. తన రికార్డుల్ని క్లియర్ చేస్తానంటూ హెడ్లీ హామీ ఇచ్చాక ఇద్దరం ముంబై దాడులకు ప్లాన్ చేశాం.. దాడులకు కొన్నిరోజుల ముందు 2008 నవంబరు 20, 21 తేదీల్లో ముంబై పోవై హోటల్లో ఉన్నా.. తర్వాత దుబాయ్, బీజింగ్ చేరుకున్నా.. గల్ఫ్ యుద్ధంలో రహస్య మిషన్ కోసం సౌదీ వెళ్లా..‘ అని తెలిపాడు.