ఆన్లైన్ ట్రేడింగ్(Trading) స్కాంలో ఇరుక్కుని సాఫ్ట్ వేర్ దంపతులు రూ.1.53 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించడంతో రూ.1.04 కోట్లు తిరిగివచ్చాయి. బెంగళూరులోని బనస్వాడీలో ఉంటున్న టెకీ జంట.. పెట్టిన పెట్టుబడికి భారీ మొత్తంలో వస్తుందన్న ఆశతో వలలో పడింది. UK నుంచి ఆపరేట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఫేక్ వెబ్ సైట్ సృష్టించి తమ పెట్టుబడి ఎలా పెరుగుతుందో వారికి రెగ్యులర్ గా చూపించారు.
తొలుత ఆ సైట్ నుంచి కొంత మొత్తం తీసుకున్నా ఆ తర్వాత అది పనిచేయకపోవడం(Inaccessible)తో పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు.. బ్యాంకు అధికారులతో మాట్లాడి అకౌంట్స్ ను ట్రాక్ చేస్తూనే ఈ మనీ 50 అకౌంట్లకు వెళ్లినట్లు గుర్తించారు. పోయిన గంటలోపే(Golden Hour) కంప్లయింట్ ఇవ్వడం.. అన్ని అకౌంట్లను బ్లాక్ చేయడం వంటి కారణాలతో డబ్బులో ఎక్కువ భాగం తిరిగివచ్చింది.