
ఉగ్రవాద లింకులపై దేశంలోని పలు చోట్ల జరిపిన దాడుల్లో కుట్రదారులు దొరికారు. రాంచీ(Ranchi)లో తొలుత హషర్ డానిష్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్, ఝార్ఖండ్ ATS పోలీసులు పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో హుజైఫా ఎమన్ ను బోధన్ లో అదుపులోకి తీసుకుని గన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక వీడియో కాల్ యాప్ ద్వారా దుండగులు మాట్లాడుకుంటున్నట్లు గుర్తించారు. తమ వర్గంపై దాడులు జరిగితే ఏం చేయాలి, దేశంలో దాడులు, మతకల్లోలాలు ఎలా సృష్టించాలనేదానిపై చర్చించుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. దుండగుణ్ని నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. ఢిల్లీ తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.