పశ్చిమబెంగాల్లో మహిళను ఒకరు చితకబాదిన(Thrashing) ఘటన కలకలం రేపుతున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మమతా బెనర్జీ సర్కారుపై అన్ని పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి(Criticized). ఈ దాడి చేసింది ‘JCB’ నిక్ నేమ్ కలిగిన తృణమూల్ కాంగ్రెస్(TMC) లీడర్ తేజేముల్ అని ఆ రాష్ట్ర CPI(M) కార్యదర్శి తెలిపారు.
మహిళతోపాటు మరో వ్యక్తిని కర్రతో కొడుతుండగా చుట్టూ ఉన్న జనం కళ్లప్పగిస్తూ సపోర్ట్ చేస్తున్న వీడియో పెద్దయెత్తున దుమారం రేపింది. తాలిబన్ పద్ధతుల్లో సత్వర తీర్పు(Quick Justice) అందించేలా ఏర్పాటు చేసిందే ‘ఇన్సాఫ్ సభ’. ఆ గుంపునకు పెట్టిన మరో పేరే ‘ఇన్సాఫ్ సభ’. ఇంతకుముందే పెళ్లయిన ఆమె.. మరో వ్యక్తితో(మహిళతోపాటు దెబ్బలు తిన్న) వివాహేతర సంబంధం వల్లే ఇలా కొట్టారని ప్రచారం జరిగింది.
ఈ ఘటనపై ఇస్లాంపూర్ జిల్లా SP కేసు ఫైల్ చేసి నిందితుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఇది బీజేపీ-సీపీఐ(ఎం)-తృణమూల్ పార్టీల మధ్య ఆరోపణలకు దారితీసింది. పశ్చిమబెంగాల్లో షరియా చట్టాలు అమలు చేస్తున్నారంటూ TMCపై రెండు విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరాయి.