అక్రమ సరోగసీ(Surrogacy) కేంద్రాలు ఒక్కటొక్కటీ బయటపడుతున్నాయి. ఎంతోమంది అమాయకులను ఆసరా చేసుకున్న సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం అక్రమాలు మరవకముందే మరో రెండు క్లినిక్ ల దందా వెలుగుచూసింది. హైదరాబాద్ మాదాపూర్ లో పోలీసులు, వైద్యారోగ్య అధికారులు మూకుమ్మడి(Joint) దాడులకు పాల్పడ్డారు. APకి చెందిన తల్లి, కుమారుణ్ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు అవసరమైన పేద మహిళల్ని ఎరగా వేసి అక్రమ వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎగ్ డోనర్, సరోగసీ మదర్ గా అగ్రిమెంట్స్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తుండగా, ఆమె మానవ అక్రమ రవాణా కేసులోనూ సిద్ధహస్తురాలని పోలీసులు నిర్ధారించారు.