మాదక ద్రవ్యాల(Drugs)పై ఎంతగా దృష్టిపెడుతున్నా చాపకింద నీరులా అక్రమ దందా నడుస్తూనే ఉంది. తాజాగా మేడ్చల్(Medchal) ఎక్సైజ్ పోలీసులకు ఇద్దరు దొరికిపోయారు. గండి మైసమ్మ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో వాహన తనిఖీలు చేస్తున్న టైమ్ లో అనుమానాస్పద రీతిలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి MDMA రకం డ్రగ్స్ దొరికాయని STF ఎస్సై పవన్ రెడ్డి తెలిపారు.
టూల్ కిట్లో…
బైక్(Motor Cycle) టూల్ కిట్ బాక్స్ లో ఉంచి డ్రగ్స్ తరలిస్తున్నారు దుండగులు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే… బెంగళూరుకు చెందిన కిరణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని పల్లపు క్రాంతి, మహ్మద్ షోయబ్ అనే వ్యక్తులకు అందజేసినట్లు తేలింది. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని SI తెలిపారు. డ్రగ్స్ పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ రావు, కానిస్టేబుల్స్ చెన్నయ్య, శ్రీనివాస్, జ్యోతి తదితరుల్ని ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్ అభినందించారు.